If love becomes marriage ?? ( ప్రెమే పెళ్ళయుతే ?? )


ప్రెమే పెళ్ళయుతే ??

ప్రేమించుకున్న జంట కి పెద్దల అంగీకారం దొరికితే వాల్లకి అంత కన్నా కావలిసింది ఎముంది??? నాకు తెలిసినంత వరకు ప్రపంచం లోని 7 వింతలు కన్న ఆ జంట కి పెద్దలు ఊపిన పచ్చ జెండా నె అందం గాను ఆశ్చర్యం గాను, ప్రభాతం లాగా హాయి గా ఉంటుందెమొ. వీళ్ళకి,ఒకరి కి మరొకరు లొకం తప్ప వెరె లొకం గాని దాని పొకడ గాని అవసరం లెదు.
ప్రెమించుకున్నన్ని రొజులు వీళ్ళకి అటు పెద్దలు ఇటు స్నెహితులు ఏవ్వరు కుడా గుర్తుకు రారండి.(ఎదొ చిన్న చిన్న సహయాలకి (స్నెహితులు) , కాలెజి ఫీజు కట్టటానికి (తల్లి తండ్రు లు) తప్ప ఇంకెప్పుడు కుడా ప్రంపంచం తొ పెద్ద పని ఎమీ ఉండదు వీళ్ళకి..). అన్నట్టు నాకు తెలియక అడుగుతాను వీళ్ళు ప్రెమించెటప్పుడు ముందే పెద్దలు అంగికరించరు లే అని start అవుతారా లేక దాని గురించి ఆలొచించే తీరిక వీళ్ళకి ఉండదు అంటారా ?? ఇలాంటి మరొప్రపంచపు జంటలకి, ఒక్క సారిగా ఇంటిల్లపాది "Ohh Yes, right right" అంటే?? ఇంకేముంది ఈ కాలం లో కూడా ఎదొ MO వచ్చినట్టు, ఇండియా, అమెరికా కి తన work ని outsource చెసినట్టు, KCR అంధ్రా కి, YSR తెలంగాణ కి CM అయినట్టు, ఇంకా ఎదో ఎదో అయినట్టు మొత్తానికి అశ్చర్యమైన అనందం లొ అయోమయం గా అలొచిస్తూ కుర్చుంటారు.ఇలా అశ్చర్యమైన అనందం లొ అయోమయం గా అలొచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మన లోకం లోకి వచినట్టే మరి... ఆ అప్పుడు గుర్థుకు వస్తారు friends అంతా ...(ఎవరెవరు support ఎవరెవరు oppose,ఛుట్టాలు,కాలెజి లొ lecturers,librarians దగ్గరి నుండి watchman వరకు ..ఒక్కల్లు ఎంటి ఇంక అందర్ని తిరగ తొడుతూ ప్రపంచాన్ని మొత్తం గుప్పెట్లొకి తీసుకుని ఇంక పిండటం మొదలు పెట్టెస్తారు) మొబైల్ తీసుకుని ఫొన్ బుక్ లొని ఒక్కొ నంబర్ కి కాల్స్ మొదలుపెడతారు.ఫ్రపంచాని నలపటం మాట పక్కన పెడితే అసలు కష్టాలు ఇప్పుడు మొదలు అవుతాయి వీళ్ళకి.ఏందుకంటే ఇప్పటివరకు ఉన్నది "మరో చరిత్ర" లొ కాబట్టి.
ఆన్నట్టు గమనించరా మరో చరిత్ర అని వాడెసాను. ఆదెంటో తెలీదు ఆ బాలచందర్ గారు ఎమంటూ ఆ సినెమా తీసారో గాని పైగా అది నేను ఏ ముహుర్తాన చుసానో గాని ప్రెమ ( love success అయినా failure అయినా గాని)అన్న పదం వస్తే చాలు ఈ మరో చరిత్ర వచేస్తుంది బుర్రలొకి. ఈ బుర్ర ఉంది చుశారూ దీనికి కాస్తంత మతి మరుపు తక్కువెమో, నన్ను కాల్చుకు తింటుంది అంటె నమ్మండి. ఏప్పు డూ ఎదొ ఒకటి గుర్థు చేస్తునే ఉంటుంది.ఒక పని చేస్తూ ఉంటె ఇంకో పని ఏదో గుర్థు చెస్తుంది, మ శెడ్డ శిక్కు వచిపడింది దీనితొ. అంత ఎందుకు ఇప్పటి కిప్పుడు ఈ పొస్ట్ రాస్తున్నానా?? ఎమి చెప్తుందో తెల్సా మీకు " ఒరే నువ్వు ఆఫిస్ లో రా ఉంది, ఈ సోది రాయటం ఆపి కాసింత పని చెయరా !! ఆ లండన్ లొ onsite వాడు వచ్హాడు అంటె నిన్ను ఫొన్ లోనే questions తొ చంపెస్తాడు రా!!" ఇదండి దీని వరస ...
అసలు కద లోకి వస్తె మొన్న నాకు బాగా కావల్సిన ally తన love success అయిందని... ఆ marriage details చెప్పటానికి కాల్ చేసి జరిగిందంత చెప్పాడు ఆ ఫొనె కాలె ఇప్పటివరకు రాసాను, ఇహ పోతె రాయబొయెది వాల్ల పెల్లికి వెల్లాను గా ఆ విషయాలు .

పెళ్ళికి అయుదు రొజులు ముందు మా వాడు నాకు ఫొనె చెసి బెంగుళురు లో ఉన్న మా friends అందరికీ పేరు పేరునా cards ఇవ్వమని చెప్పిన్నపుడు - "సుబ్బి పెల్లి ఎంకి చావు కి వచిన్నట్టు" అన్న సామెత గుర్తు వచింది. నిజం గా ఇలాంటి చిన్న పని మన ఉర్లొ అయితే, ఎలాగో ఒక సారి మన స్నేహితులందరిని కలిసినట్టూ ఉంటుంది కాబట్టి హాయి గా సునాయసం గా అనందం గా చెసెయ్యొచ్హు. కాని అదే పని ఈ బెంగుళురు మహనగరం లో అంత సునాయసంగా ఎమీ ఉండదు సరి కదా పని అయ్యె సరికి తప్పకుండా అయాసం మాత్రం వస్తుంది.సాఫ్ట్ వేర్ పుణ్యమా అంటూ, ఏటు పడి తే అటు ఒక వరస వాయీ లేకుండ పెరిగిపొయింది ఈ మహానగరం.
 
ఒక్కొక్కల్లు ఒక్కొ దగ్గర ఉంటే ఎలాగండి? కాని తప్పదు.అటు Electronic city నుండి ఇటు యశ్వంతపూర్ వరకూ ఇంక మద్యలో కోరమంగల, ఇందిరానగర్, సిల్క్ బోర్ద్ , మర్థ హల్లి, దొములూర్ ...అబ్బో ఇలా కెలికితే చాలా cards ఉన్నాయి. సరే ఎంతైనా సాఫ్ట్ వేర్ వాడిని కదా అని అలోచించటం మొదలు పెడితే బుర్ర లోకి చట్టుక్కున వచింది చక్కటి ఆలొచన, అదే Dijkstra's Algorithm . ఫాడు బుర్ర కి అది తప్ప వెరే కొత్త అలోచనలు ఎమీ రావటం లేదు. పాపం బుర్ర కి ఏమి తెల్సు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఎదైన రెండు ప్లేసెస్ మద్య shortest distance అనగానే The best algorithm అని బాగా నూరి పోసారు అది వెంటనె పొతుందా మరీ? ఒక్క క్షణం ఆగి అలోచించా అప్పుడు తెలిసింది ఇక్కడ ఉన్న ప్రోబ్లెం DSGT(Discrete structure and graph theory) టెక్స్ట్ బుక్ లొది కాదు అని.కాబట్టి ఎవరైన పెల్లి అయిన మెధావి ని అడుగుదాం, అనే ఇంకో అద్బుతమైన idea వఛ్హిందిidea. నిజం గానే ఒక్క ఐడియా నా జీవితాన్నె మార్చెసింది.
ఇంతకీ ఆ మెధావి ఇచ్హిన సలహా ఎమిటో తెల్సా? తెలిస్తే తెల్లపోతారు-"నీ పుట్టిన రోజు అని చెప్పి అందరిని party కి పిలిచి అక్కడె cards ఇచ్హెయ్". అది విన్న నెను ఒక తెలుపు ఎంటి చాలా రంగులు పొయాను లెండి.నిజం పుట్టినరోజు కి పిలిస్తే కుడా కలిసేంత ఖాలి లెకుండా జానాలు ఉంటె ఇంక అబద్దపు పుట్టినరోజు కి పిలిస్తే ఎవరు వస్తారు ?? ఎక్కువ అలోచిస్తె పని అవ్వటం లెదు అని నా పల్సర్(pulsar)తీసి పరారు అయ్యా, పని పూర్థి చేసా.

అంతా అయ్యి పెళ్ళికి రెండు రోజులు ముందు బయలుదేర్తాను అనగా ఒక హీరో లాంటి కుర్రాడు కాల్ చెసి " బ్రథెర్ నీ దగ్గర గాని extra ticket ఎమైన ఉందా? urgent గా అంధ్రా రావాలి ఎలాగు వస్తాను కాబట్టి మన వాడి పెళ్ళి లో కూడా హాజరు వెయించుకుంటా అన్నాడు". నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఫొన్ పెట్టెసి కాసేపు అగి కాల్ చెసి, ఉంది రా రా !!అన్నాను(అందరు హేరో లే కదా! హెరో ల కోసం నేను extra tickets చేసాను లెండి).ట్రైన్ లో తగిన అనదం కోసం పూర్థి స్థాయి ఎర్పాట్లతో, ఆఫీసు లో బాద్యతలు అన్ని యదా విదిన ముగించి భారి బరువుల బ్యాగేజి తో శకట స్థానానికి(railway station) చేరుకున్నాం - నేను, నా హేరో ఫ్రెండు తో కలిపి మొత్తం ఆరుగురు.

అది "ప్రశాంతి" మా కందరికీ ఆ రోజు పెద్ద "అశాంతి". ఏప్పటిలాగనె మా కన్నా బద్దకం గా ఒక గంట లేటు గా బయలు దేరింది ఆ రోజు కూడా."ప్రశాంతి" అంటే అశాంతే అన్నట్టు గా మా అనందానికి భంగం కలిగిస్తూ బాబా భక్తులు భజనలు మొదలు పెట్టారు. ఈ లోపల మా హేరొ పొకిరి లో వేణు మాదవ్ లాగా "బాబ్ బాబ్" అని గొడవ చేస్తూ ఆకలో "క్రుష్ణ బాబూ" అంటు ఆర్థనాదాలు మొదలెట్టాడు. మా బ్యాచ్ లొ ఒకడు కొంచం సేపటి లో "దర్మవరం" వస్తుంది అప్పటి వరకు ఉండు అన్నాడు. వెంటనే కంగారు గా నాకు ఇచ్హిన టికెట్ దర్మవరం వరకేనా ?? అని అయొమయం గా అడిగాడు మన హేరో ? కాదులేరా దర్మవరం లో వడలు చాలా బాగుంటాయి కుమ్మెద్దు లే అని బుజ్జగించాం. మాట్టల్లొనే దర్మవరం వచింది,ట్రైను స్టేషను దాటే లోపలనే ఇంచుమించు గా 150 రూపయల వడలు తినేసాం.మొత్తానికి రాత్రి గడిచింది. ఉదయానె సుప్రభాతం లాగా "బాలయ్య మనసు వెన్నపూస"," నందమూరి వంశం వర్దిల్లాలి", "తెలుగు దేశం జిందాబాద్" అంటూ కెకలు వినిపించాయి ఎంటా? , అని ఆరా తీయగా వాల్లంతా "యువ ఘర్జన" కొసం వెల్తున్నారు అని చెప్పారు.ఈ లోగా ఎవరో నిన్న చిరంజీవి రోడ్ షో లో అయన పైన తెలంగాణ రాష్త్ర సమితి పార్టి కార్యకర్థలు కోడి గుడ్లు కొట్టారు అని చెప్పారు.ఈ లొపల విజయవాడ స్టేషను వచ్హింది, అత్రం గా వర్తాపత్రిక కొంటే పత్రిక అంతా పచ్హ రంగే. ఇదంతా "యువ ఘర్జన" హడావిడి గామోలు అని సరి పెటుకున్నా.
మొత్తానికి పెళ్ళికి మచిలీపట్నం బయలు దేరాం.బస్ అంతా నిండటం తో కొందరు కాలి ఉన్న కారు లో ఎక్కాము.పెళ్ళి బస్ తాడేపల్లిగుడెం లో బయలుదేరి ఏలూరు,హనుమాన్జుంక్షన్,గుడివాడ, గుడ్లవల్లేరు మీదుగా సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం చేరుకున్నాం.ఊరి పొలిమేర లోనే మమల్ల్ని ఒక బ్రుందం అడ్డగించి మా వాహనాలని ఆపింది. ఇదెంటి రా బాబూ అని కంగారు పడ్డాను,సరిగ్గా పరికించి ఆ బ్రుందం వైపు చుస్తే ఒక మొహం ఎప్పుడో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో చూసిన గుర్తు వచ్హింది, ఈ లోగా ఆయనే కారు దగ్గర కి రావటం తొ నిర్దారించుకున్న ఆయన ఎవరో కాదు పెళ్ళికూతురు తండ్రి అని. ఇంతకి ఎందుకు ఆపరా అని అలోచిస్తూ ఉండగా చాలా పెద్దగా "శుక్లాం బరదరం..." అని గణపతి శ్లోకం వినపడింది, అది పక్కనె ఆపి ఉన్న మ్యుసిక్ ట్రూప్ వెహికిల్స్ లో ఉన్న పెద్ద పెద్ద స్పీకెర్స్ నుండి. అది కాగానె ఒక అనౌన్స్ మెంట్ "షేక్ లాల్ సంగీత విభావరి. సమర్పించు వారు షేక్ లాల్ మ్యుసిక్ ట్రూప్ అత్తిలి ..." ఇది ఇలా ఉండగా మా పెళ్ళి బ్రుందం అంతా అలొచనగా చూస్తు ఉన్నాయి తదుపరి ఎమిటా ఎప్పుడు కదులుతామా అని ?, ఒక 30 నిమిషాల తర్వాత ఆ మ్యుసిక్ ట్రూప్ పాటలు అపి, పది అడుగులు ముందుకు వేసాయి. ఇంక ఊపిరి పీల్చుకున్నాం కళ్యాణమండపానికి చెరుతున్నాం అన్న దీమా లో,కాని మా అంచనాలు తారుమారు చేస్తు వాల్లు అక్కడె ఆపి ఇంకొ పాట పాడటం మొదలు పెట్టారు, పాట పాడితే పర్లెదు, ప్రతి పాటకి "షేక్ లాల్ సంగీత సారద్యం లో... అత్తిలి.. అని అనౌన్స్ మెంట్", ఇదే అనౌన్స్ మెంట్ మహేష్ బాబు సుపర్ హిట్ సినెమా పొకిరి లోని పాటకి కూడా ఇచ్హెసరికి నా కోపం రెట్టింపు అయింది ...కాని వాడితో గొడవ ఎందుకు లే అని లైటు తీసుకున్నా. అలా అతి నెమ్మదిగా మేము ఆ మ్యుసిక్ ట్రూప్ వెనాకలె "లక్ష్మి టాకీసు" రోడ్ లోకి వచ్హాము, అది నాకు బాగ తెలిసిన రోడ్, నేను నా ఇంటర్మీడియట్ ఇక్కడె "నలంద" లో పూర్తి చెయటం వల్ల ఆ ఎరియా బాగానె తెల్సు . వెంటనె సంసయించకుండా కారు దిగి మా గ్యాంగ్ కి కూడ ఫొన్ చీసి బయటకి రమ్మని చెప్పాను. అంతా కలిసి లక్ష్మి టాకీసు సెంటర్ లో బగా ఫేమస్ అయిన పెరుగు టమటా, బజ్జీలు నానా చెత్తా తినేసాం. ఆ ఎరీయ, ఆ బజ్జీల బండి చూడగానె నాకు నా ఇంటర్మీడియట్ ఫ్రెండు సాయి దత్తు,నేను చేసిన అల్లరి అంతా గుర్తు వచ్హింది.ఎదెమైన "Old is Bold".
ఎలాగు మాకు రూం ఇచ్హిన హొటెల్ కి చేరి, వెంటనె తయారు అయ్యి కళ్యాణమండపానికి చెరుకున్నాం, లాల్ బాష సంగీత విభావరి పుణ్యమా అంటూ బాగా లేటు అవ్వటం తో జరిపించాల్సిన ముఖ్యమైన కర్యక్రమాలు మాత్ర్రం జరిపారు, రెసెప్షన్ లేకపొటం తో, పాపం మా వాడు బొలెడు ఖర్చు పెట్టి కొన్న సూటు వేసుకునే భాగ్యం మిస్స్ అయ్యాడు. అదేమిటో అర్దం కాదు ఏ పెళ్ళి లోనూ పెళ్ళికూతురు తల్లి-తండ్రులు అనందం గా కనపడరు.ఈ పెళ్ళి లో మాత్రం వీల్లు మాములు బాద గా కాక బయంకరమైన బాదగ గా ఉన్నారు, బహుసా అది "ప్రెమే పెళ్ళయుతే" వలన గామోలు. అలాగ ఆ రాత్రి గడిచింది.
గది లో AC ఉంటే ఎంత బాగుంటుదో, ఆ గది లొ దుప్పటి లెకపొతే అంత దారుణం గా కూడా ఉంటుంది కదా!!ముహుర్తం 6:30 AM కి కావటం మరియు సరిగ్గా నిద్ర పట్టక పొవటం తో అయిదు గంటలకే నిద్ర లేచి తయారు అయ్యి మా ఫొటో డబ్బాలు (cameras) తగిలించుకుని బయలుదేరాం.
వెల్లినప్పటి నుండీ పలహారాలు ఎప్పుడు రా బాబూ అని అందోలన మొదలెట్టారు జనాలు.ఈ లోపల ఎదో పెళ్ళిలకి ఫొటొ లు తీసే నెర్పు ఉన్నట్టు చాలా ఓర్పు గా మా వాల్లంతా అసలు ఫొటొగ్రాఫెర్ ని సైతం తొసేస్తూ పెళ్ళిమండపం అంతా కలతిరుగుతూ వచ్హినట్టు, రానట్టు ఎవో చాలా ఫొటొ లు తీసి, తెగ ఆనందపడిపొయారు.

పెళ్ళి పూజల తో పూర్తి గా బిజీ గా ఉన్న మా వాడిని(పెళ్ళి కొడుకు ని) పిలిచి,పెళ్ళి కి పిల్లలు ఎక్కువ మంది రాలెదెంటి రా అని అడిగితే పెళ్ళి మద్యలొనే లెచి వచ్హి మరీ కొడతాడెమో అని గమ్ము న ఉన్నాము. అక్కడెక్కడో అమెరికా లో సాఫ్ట్ వేర్ పడిపోవటం ఎమిటో వీడి పెళ్ళికి అమ్మాయి లు రాకపోవటమెమిటో అని అమాయికం గా అలోచిస్తూ ఉంటే అదేపని గా పలహరాల కోసం చుస్తూ ఉన్న మా వాడొకడు మామా టిఫిన్ వచ్హింది అంట రా, గారెలు అంట coffee, వెల్దాం రా అంటే ఆ పని కాస్తా కానిచ్హెసాం. అర్దం కాక పొయినా అర్దం చెసుకోవటానికి పెళ్ళిని, మద్య మద్య లో హడావిడి చేస్తూ అటూ ఇటూ తిరిగే ఆంటీలని, వాల్ల అమ్మయిలని తీసుకురాందుకు తిట్టు కుంటుంటె మరొపక్క షేక్ లాల్ సంగీత విభావరి లో situation తో మాకు సంబదం లేదు అన్నట్టు "రగులుతుంది మొగలి పొద..." అన్న పాట వేసాడు. వాడి బాద బరించలెక వాదికి ఒక 50 రుపాయలు ఇచ్హి మెము చెప్పిన పాట వెయ్యి షేక్ లాల్ అంటె, సరే అన్నాడు.పెళ్ళికొడుకు కి చిరంజీవి అంటే ఇష్టం కదా అని ఎదైనా చిరంజీవి పాట వేయరు అంటె, ఆపినా ఆప కుండా ఠాగూర్ చిత్రం నుండి "నేను సైతం ప్రపంచాగ్ని కి .." అన్న పాట వేసాడు. ప్రెమే పెల్లైన ఆనందం లో మా వాడు ఉంటే, ఎదో త్యాగం చెసి భాద పడుతునట్టు ఈ పాట వేసాడు బాషా. అప్పుడె అనుకున్న అత్తిలి వాల్లని రికార్డింగ్ డాన్స్ ప్రొగ్రాంలకి తప్ప పెళ్ళి ల కి పిలవకూడదు అని..ఒక వేళా పిలిచినా మన షేక్ లాల్ ని మట్టికి పిలవకూడదు అనుకుని సరిపెట్టుకున్న.
మొత్తానికి మా వాడి ప్రెమ ని, పెళ్ళి ని దిగ్విజయం చెసేసి హ్యాపీ గా హనీమూన్ కి వెల్లరాbee అంటే - లేదు రా "తిరుపతి","షిర్డి" .....అని వరసగ చాలా పుణ్యక్షెత్రాల పేర్లు చెప్పెసి, ఫ్యామిలీ తో వెల్తున్నాను అన్నాడు. బహుసా పెళ్ళి అయ్యకా తల్లా పెల్లమా లాంటి సమస్యలు రాకూడదు అనేమో ... అదండి ప్రెమే పెల్లైతే ...ఇంకెదుకు ఆలస్యం మీరు కూడా ...ప్రేమో , పెళ్ళో ...chatterbox not worthy




8 comments to "If love becomes marriage ?? ( ప్రెమే పెళ్ళయుతే ?? )"

  • babu , enjoyed a lot with aunties and uncle's???????????????

    i think it's a great enjoyment with friends..

  • Krishna, 'Love becomes marriage' post is very interesting and good. Keep rocking...

  • intaki aa hero evadu raa???

  • ఆశ, దోశ, అప్పడం ... అన్ని చెప్పేస్తార ఎంటీ? నువ్వు కూడా హేరోవే అందులో అనుమానం లేదు. అయినా ఆ ప్రశ్న నీకే ఎందుకు వచ్హినట్టో ???

  • krishna garu , meeru chala baga rasaru.

    oka side premani varnisthu , thiduthu, poguduthu mello kavithvam dagi vundi ani nerupinchukunnaru.

    chala chala....... baga rasaru

  • If love becomes marriage
    Liked your post and caption too but
    when I saw this I thought I can find something related to after (love)marriage effects, great narration though!!

  • గది లో AC ఉంటే ఎంత బాగుంటుదో, ఆ గది లొ దుప్పటి లెకపొతే అంత దారుణం గా కూడా ఉంటుంది కదా!!....బాగుంది. ఇంతకీ మీ పెళ్ళికి ఎవరి బ్యాండు పెట్టిస్తారు. రాస్తూ ఉండండి .. తెలుగులోనే.

  • అయ్యా కృష్ణ బాబు..నేను ఎ పోస్ట్ చడువుతున్నప్ప్డు నవ్వలేక సచిపోయాను..especially the slang u used...one of the humorous post in u r blog !!!!

Post a Comment

Whoever writes Inappropriate/Vulgar comments to context, generally want to be anonymous …So I hope U r not the one like that?
For lazy logs, u can at least use Name/URL option which doesn’t even require any sign-in, The good thing is that it can accept your lovely nick name also and the URL is not mandatory too.
Thanks for your patience
~Krishna(I love "Transparency")

Popular Posts

Enter your email address:

Buffs ...

Tags


Powered by WidgetsForFree

Archives